5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: కింగ్ కోటి ఆస్పత్రి ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన
Showing posts with label కింగ్ కోటి ఆస్పత్రి ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన. Show all posts
Showing posts with label కింగ్ కోటి ఆస్పత్రి ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన. Show all posts

Tuesday, June 22, 2021

కింగ్ కోటి ఆస్పత్రి ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన

 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనం 19 వేలు చెల్లించాలని  డిమాండ్ చేస్తూ నేడు కింగ్ కోటి ఆస్పత్రి ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేయటం జరిగింది ఈ సందర్భంగా  *తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(AITUC)  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం. నర్సింహ*   మాట్లాడుతూ  రాష్ట్రంలో అన్ని రకాల సిబ్బందికి జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో శానిటేషన్, పేషెంట్ కేర్' సెక్యూరిటీ కార్మికులకు మాత్రం విస్మరించడం అన్యాయమని   గత సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ సిబ్బందికి కనీస వేతనం 19 వేలు చేయాలని అప్పటి వరకు పోరాటం  నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు  

శానిటేషన్ సిబ్బంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వారికి 17 వేలు, ఇఎస్ఐ ఆస్పత్రుల్లో సెంట్రల్ గవర్నమెంట్ రూ 16770/-, నిమ్స్ లో రూపాయలు 15వేలు చెల్లిస్తున్నారని, శానిటేషన్  పని ఆస్పత్రుల్లో చాలా మరికితో  కూడుకున్న పని అని ఆ పనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు