ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనం 19 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు కింగ్ కోటి ఆస్పత్రి ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేయటం జరిగింది ఈ సందర్భంగా *తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(AITUC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం. నర్సింహ* మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల సిబ్బందికి జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో శానిటేషన్, పేషెంట్ కేర్' సెక్యూరిటీ కార్మికులకు మాత్రం విస్మరించడం అన్యాయమని గత సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ సిబ్బందికి కనీస వేతనం 19 వేలు చేయాలని అప్పటి వరకు పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు
శానిటేషన్ సిబ్బంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వారికి 17 వేలు, ఇఎస్ఐ ఆస్పత్రుల్లో సెంట్రల్ గవర్నమెంట్ రూ 16770/-, నిమ్స్ లో రూపాయలు 15వేలు చెల్లిస్తున్నారని, శానిటేషన్ పని ఆస్పత్రుల్లో చాలా మరికితో కూడుకున్న పని అని ఆ పనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు
ReplyForward |
No comments:
Post a Comment