ఇండియా ఒక్క రోజే 86.16 లక్షల వాక్సిన్ డోస్‌లను వేసింది. ప్రపంచంలో ఇలా ఒక్కరోజు గరిష్ఠ వాక్సిన్‌లు వేయడంలో రికార్డు సాధించింది.దేశ వ్యాప్త వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 28.87 కోట్ల వాక్సిన్‌లు వేయడం జరిగింది ఇండియాలో గత 24 గంటలలో 42,640 కొత్త కేసులు నమోదయ్యాయి. 91 రోజులలో 50,000 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.ఇండియా లో క్రియాశీల కేసుల సంఖ్య 6,62,521 కి పడిపోయింది. 79 రోజుల తర్వాత ఇది 7 లక్షల దిగువకు చేరింది.దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,89,26,038 కోట్ల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.గత 24 గంటలలో 81,839 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.దేశంలో రోజువారి కోవిడ్ కేసుల కన్న కోవిడ్ నుంచి కోలుకున్న వారిసంఖ్య వరుసగా 40 వ రోజు ఎక్కువగా ఉంది.రికవరీ రేటు 96.49 శాతానికి పెరిగింది. వారపుపాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 3.21 శాతం వద్ద ఉంది.రోజువారి పాజిటివిటి రేటు 2.56 శాతం. ఇది వరుసగా 15 రోజులు 5 శాతంకంటే తక్కువగా నమోదైంది.దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య ను గణనీయంగా పెంచడం జరిగింది. మొత్తం 39.40 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు
No comments:
Post a Comment