హైదరాబాద్ సమతుల ఆహారంతో పాటు ఏవేని 2 రకాల పండ్లను ప్రతిరోజు తినటం ద్వారా టైపు 2 డయాబెటిస్ ముప్పుని 36 శాతం తగ్గించుకోవచ్చని వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం (ఇసియు) పరిశోధకులు కనుగొన్నారు
జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం రెండు సర్వ్స్ పండ్లను తిన్నవారికి సగం కంటే తక్కువ సర్వ్ తిన్న వారి కంటే ఇన్సులిన్ సున్నితత్వం ఎక్కువ.
ప్రపంచవ్యాప్తంగా 451 మిలియన్ల మంది టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు.మరో 374 మిలియన్ల మందికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
అధ్యయనం యొక్క ప్రధాన రచయిత, ECU యొక్క ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ రీసెర్చ్ డాక్టర్ నికోలా బొండోన్నో వివరాల ప్రకారం ఎక్కువ పండ్లను తినేవారు వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయవలసి ఉంటుందని సూచిస్తున్నారు.“ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అధిక స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి (హైపర్ఇన్సులినిమియా) రక్త నాళాలను దెబ్బతీస్తుంది మరియు ఇది డయాబెటిస్కు మాత్రమే కాకుండా, అధిక రక్తపోటు, ఊ బకాయం మరియు గుండె జబ్బులకు దారితీస్తుంది
No comments:
Post a Comment