Nizamabad: నాలుగో రోజుకు చేరిన ఆస్పత్రి కార్మికుల నిరసన నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు 4వ రోజు
జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ (AITUC) రాష్ట్ర నాయకులు దుబాస్. రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో జరుగుతున్న నిరసనలో భాగంగా నిజాంబాద్ జిల్లా ఆస్పత్రి ముందు 4వ రోజు కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం 19000/- రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు మార్చిందని కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాలను రద్దు చేసి అందరిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు పి సుధాకర్ నాయకులు భాగ్యలక్ష్మి ,కవిత, యాదగిరి ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment