5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచిత శస్త్ర చికిత్స, వైద్య అందిస్తున్న బసవతారకం స్మైల్ ట్రైన్ పథకం

Saturday, June 26, 2021

గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచిత శస్త్ర చికిత్స, వైద్య అందిస్తున్న బసవతారకం స్మైల్ ట్రైన్ పథకం

అర్హులను గుర్తించడానికి వీలుగా సోమ వారం 28 జూన్ నుండి జూలై 3 వరకు చిన్నారుల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు


గ్రహణం మొర్రితో భాదపడే చిన్నారులకు ఎదురయ్యే ఇబ్బందులు ఎన్నో.  జన్యుపరమైన ఇబ్బందుల వలన వచ్చే ఈ అంగవైకల్యం కారణంగా ఎందరో చిన్నారులు పలు రకములైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే చిన్నారుల సమస్యలకు సరైన చికిత్స అందించడం ద్వారా పరిష్కారం చూపవచ్చు.  

ఈ దిశగానే బసవతారకం స్మైల్ ట్రైన్ కార్యక్రమాన్ని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా. ముకుంద రెడ్డి నేతృత్వంలో స్మైల్ ట్రైన్ స్వఛ్చంద సంస్థ మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన ఆరోగ్య శిబిరములు ఏర్పాటు చేసి గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన శస్త్ర చికిత్స మరియు ఇతరత్రా వైద్య సేవలను బసవతారకం స్మైల్ ట్రైన్ పూర్తిగా ఉచితంగా అందజేస్తోంది.  ఇప్పటి వరకూ 3000 కు పైగా చిన్నారులు ఈ కార్యక్రమంలో భాగంగా చికిత్స పొందడం జరిగింది.

అయితే కరోనా మహమ్మారి కారణంగా బసవతారకం స్మైల్ ట్రైన్ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది.  దీంతో పలువురు చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరళా ఈ ఉచిత సేవలను ప్రారంభించాలని కార్యక్రమ నిర్వాహకులు డా. ముకుంద రెడ్డి నిర్ణయించారు.  ఈ ప్రణాళికలో భాగంగా ఈ నెల సోమవారం జూన్ 28 నుండి జూలై 3 వ తారీఖు వరకు ఉచిత వైద్య శిబిరాన్ని బసవతారకం స్మైల్ ట్రైన్ ఏర్పాటు చేసింది.   ఈ ఉచిత వైద్య శిబిరంలో గుర్తించబడిన చిన్నారులకు శస్త్ర చికిత్స ఉచితంగా చేయడంతో పాటూ మందులు వంటి వాటిని పూర్తిగా ఉచితంగానే అందించడం జరుగుతుంది.

ఇలాంటి ఇబ్బందులతో భాదపడుతున్న చిన్నారుల (ఆరు నెలలు నిండిన వారు) తల్లితండ్రులతో పాటూ కొత్తగా చూపించదలచుకొనే వారితో పాటూ గతంలో శస్త్ర చికిత్స తో పాటూ ఇతరత్రా వైద్య సదుపాయాలు పొందిన తర్వాత కూడా సమస్య  పూర్తిగా నయం కాని చిన్నారులు కూడా ఈ శిబిరానికి హజరు కావచ్చు.  ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా. ముకుంద రెడ్డి విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వివరాల కోసం తల్లితండ్రులు బసవతారకం స్మైల్ ట్రైన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్, రోడ్ నెం.10, బంజారా హిల్స్, హైదరాబాదు వద్ద సంప్రదించవచ్చు లేదంటే 9348198804 / 04023551235 నెంబర్లలలో సంప్రదించవచ్చు.

No comments:

Post a Comment