కోలుకున్నవారి శాతం పెరుగుతూ 96.16%కు చేరిక,రోజువారీ పాజిటివిటీ 2.98%; 12 రోజులుగా 5% లోపే
Hyderabad : దేశంలో రోజువారీ కొత్త
కరోనా
కేసులు
తగ్గుతూ
వస్తున్నాయి.
గత
24 గంటల్లో
దేశవ్యాప్తంగా 60,753 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత
12 రోజులుగా
రోజువారీ
కేసులు
లక్షలోపే
ఉంటున్నాయి.
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాల
ఉమ్మడి
కృషితోనే
ఇది సాధ్యమైంది.చికిత్సలో
ఉన్న కేసులు కూడా తగ్గుదలబాటలో నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 7,60,019 మంది.ఇది 74 రోజులలో అత్యల్పం. నికరంగా గత 24 గంటల్లో 38,637 కేసుల తగ్గుదల నమోదైంది. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవి 2.55% మాత్రమే.ఎక్కువమంది కోవిడ్ బారినుంచి బైటపడి కోలుకుంటూ ఉండటంతో వరుసగ 37 వ రోజుకూడా వీరి సంఖ్య పెరుగుదలబాటలోనే సాగుతోంది.
గత 24 గంటలలో 97,743 మంది కోలుకున్నారు. ఇది అంతకు ముందు రోజుకంటే 36,990 అధికం.కోవిడ్ సంక్షోభం మొదలైనప్పటినుంచీ 2,86,78,390 మంది ఇప్పటికే కోలుకున్నారు. గత 24 గంటలలో కోలుకున్నవారి సంఖ్య 97,743 గా నమోదైంది. దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 96.16% గా నమోదై పెరుగుదలను
సూచిస్తోంది. కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం పెంచటంతో దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 19,02,009 పరీక్షలు జరిపారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 38,92,07,637 కు చేరింది. మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ 3.58% ఉండగా రోజువారీ
పాజిటివిటీ నేడు 2.98% గా నమోదైంది. today. ఇది 12 రోజులుగా 5% లోపే ఉంటోంది.
భారతదేశపు మొత్తం టీకా డోసుల పంపిణీ ఈ రోజు 27.23 కోట్లు దాటింది.
No comments:
Post a Comment