రాష్ట్రంలో ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఫీజులు కట్టలేక పేదలు ఇబ్బంది పడుతున్నారు..
ప్రయివేట్ ఆస్పత్రుల ఫీజుల కోసం ఆస్తులు, మెడలోని పుస్తెలు అమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం..
తెలంగాణ లోని ప్రయివేట్ ఆస్పత్రుల పై కేంద్రానికి పిర్యాదు చేసిన ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు జగన్
జగన్ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం
థర్డ్ వేవ్ వచ్చినా రాకున్నా, అన్ని జిల్లాల్లో, అన్ని పీహెచ్ సి ల్లో ఏర్పాట్లు చేయాలి.
ఢిల్లీ.. తెలంగాణ లో ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీ, వైద్యశాఖ నిర్లక్ష్యం పై కేంద్రానికి ఫిర్యాదు చేసింది బాధిత సంఘం. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ను తెలంగాణ ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు..
తెలంగాణ లో కరోనా పేరుతో ప్రయివేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయని బాధిత సంఘం అధ్యక్షుడు జగన్ ఆరోపించారు.. మొదటి, రెండో కరోనా వేవ్ ల్లో ప్రయివేట్ లో వైద్యం కోసం ఎంతో మంది తమ ఆస్తుల తో పాటూ, చివరికి మెడలోని పుస్తెలు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వాన్ని నిర్దేశించినా, ఫలితం లేకుండా పోయింది.
తెలంగాణ వైద్యశాఖ కు ప్రయివేట్ ఆస్పత్రుల పై వచ్చిన ఫిర్యాదులను లైట్ తీసుకున్నారని, నామ మాత్రపు చర్యలతో సరిపెట్టి ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీకి దోహదపడుతున్నారని ఆరోపించారు జగన్. కనీసం మూడో వేవ్ కోసమయిన రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ప్రత్యేక చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రం ఆదేశించాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్ ను జగన్ కోరారు..
థర్డ్ వేవ్ వచ్చిన రాకున్నా పిల్లల కోసం వైద్య సదుపాయాలు పెంచాలి..ప్రస్తుతం తెలంగాణ పిల్లల వైద్యం కోసం నిలోఫర్ ఆస్పత్రి మాత్రమే ఉందని, ఏ మారుమూల గ్రామంలో పిల్లలు అనారోగ్యం పాలైనా, హైదరాబాద్ వరకు రావాల్సి వస్తోందని కేంద్రమంత్రికి చెప్పారు. ప్రయివేట్ లో ఓపి చూయించుకోవాలంటేనే 800 రూపాయల నుంచి 1000 రూపాయలు కట్టాల్సి వస్తోందని, ఇక ఆస్పత్రిలో అడ్మిట్ అయితే రోజుకు లక్ష వసూలు చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.. . అందుకే ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్యంకోసం వంద పడకల ఆస్పత్రులను సిద్ధం చేయటం తో పాటూ , ప్రతి పిహెచ్ సి లో పిల్లల డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు జగన్ కోరారు.
*ప్రయివేట్ దాహానికి బడుగులే బలి అవుతున్నారని బిసి కమిషన్ కు జగన్ పిర్యాదు*
తెలంగాణ లో ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీపై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని కలిసిన బాదితసంఘం అధ్యక్షుడు జగన్. తెలంగాణ ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీకి పేదలు బలవుతున్నారని జాతీయ బిసి కమిషన్ సభ్యుడు ఆచారికి పిర్యాదు చేశారు. ప్రభుత్వం ఫిజుల నియంత్రణ కోసం జీవో 248 ఇచ్చినా ఫలితం లేదని ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.
No comments:
Post a Comment