రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బందికి జీవో నెం.63, తేదీ:-15.06.2021 ప్రకారం రూ.32,683/- వస్తుండగా మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రి నర్సింగ్ సిబ్బందికి మాత్రం కేవలం రూ.25,140/- మాత్రమే వస్తున్నదని ఇట్టి విషయాన్ని స్థానిక ఆస్పత్రి సిబ్బందికి ఎన్ని పర్యాయాలు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని కోరుతూ నేడు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్రెడ్డి ని కలిసి వినతిపత్రం అందచేయటం జరిగింది. ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏం.నరసింహ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ స్థానిక ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గత సంవత్సర కాలంగా ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వెంటనే ఈ సిబ్బందికి జీతాలు పెంచి న్యాయం చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేయటం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన తేదీ నుండి సిబ్బందికి ఏరియర్స్ తో కూడిన జీతాలు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్బంగా రమేశ్రెడ్డిగారికి విన్నవించారు.
ఔట్ సోర్సింగ్ నర్సింగ్ సిబ్బందికి పర్మినెంట్ సిబ్బంది తో పోలిస్తే తక్కువ జీతాలు ఉన్నప్పటికీ అనేక ఇబ్బందుల్ని ఓర్చుతూ వాళ్లు విధులు నిర్వహించటం జరుగుతున్నదని ఇలాంటి నర్సింగ్ సిబ్బందికి న్యాయంగా రావలసిన జీతాలను సైతం అందివ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు తెలియజేశారు.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి వెంటనే స్థానిక ఆసుపత్రి అధికారులతో చర్చించి ఈ విషయంపై సిబ్బందికి తగు న్యాయం చేసి జీతాలు పెంచే విధంగా చూడాలని దీనికి సంబంధించిన ఫైలును వెంటనే అందించాలని ఫోన్ ద్వారా తెలియజేయటం జరిగింది.
వినతిపత్రం అందజేసిన వారిలో ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది ఆస్పత్రి బ్రాంచి ప్రధానకార్యదర్శి కె.శరత్బాబు, ఏ.స్వప్న, ఇ.కవిత, హెచ్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment