5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: ప్రపంచ హృదయ దినోత్సవ ( వరల్డ్ హార్డ్ డే) సందర్భంగా సైక్లింగ్ కార్యక్రమం ను నిర్వహించిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం,

Thursday, September 29, 2022

ప్రపంచ హృదయ దినోత్సవ ( వరల్డ్ హార్డ్ డే) సందర్భంగా సైక్లింగ్ కార్యక్రమం ను నిర్వహించిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం,

 

మేడ్చల్ : ప్రపంచ హృదయ దినోత్సవ ( వరల్డ్ హార్డ్ డే)  సందర్భంగా సైక్లింగ్  కార్యక్రమం ను నిర్వహించిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం, డెకాధ్లాన్,బై సైక్లింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు, మ్యాజిక్ 106.4,  సేవ్ ది యంగ్ హార్ట్ ఫౌండేషన్  మరియు ఫిటినెస్ 9 సంస్థలు.ఈ రోజు సెప్టెంబరు ‌29 వ తేదీ ‌వరల్డ్ హార్డ్ డే సందర్భంగా మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రులు వైద్యులు గుండె ఆరోగ్యం పై అవగాహన  కల్పిస్తూ డెకాధ్లాన్ ,కొంపల్లి ఆవరణలో సైక్లోధాన్ ను నిర్వహించారు,,, ఈ సైక్లోధాన్ లో‌ సుమారు 2000 మంది మెడికల్ విద్యార్థులు మరియు యువకులు ‌పాల్గొన్నారు....
ఈ కార్యక్రమం లో పాల్గొన్న యువకులు, వైద్యులు, వైద్య విద్యార్థులు , గుండె సంబంధించిన  వ్యాధిల  నుండి ఆరోగ్యం గా బయట పడ్డ పౌరులు పాల్గొని  సైకలింగ్ చేసి‌ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను వివరిస్తూ సైకల్ మీద సుచిత్ర డెకధ్లాన్ నుండి సినీ ప్లానెట్ వరకు సైకల్ మీద ప్రయాణం చేశారు.అనంతరం వేదిక మీద ఆట,పాటల పాడి యువతలో  ఉత్సాహం నింపారు...
ఈ కార్యక్రమం ముఖ్య అతిథి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని, గుండె సంబంధించిన వ్యాధుల‌ నుండి ఎలా రక్షించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో, ఏలా భద్ర పర్చుకోవాలో  చక్కగా వివరించిన వైద్యులకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు...
డా" భద్రారెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయమైన ,అనుభవజ్ఞులైన వైద్యులచే, ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని తెలిపారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డా" భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment