*సిరీస్ ఏ ఫండింగ్‌లో 15 మిలియన్ డాలర్లను సమీకరించిన భాన్జు (Bhanzu)*;
ఇండియా, సెప్టెంబర్ 22nd 2022 : హైదరాబాద్ సంస్థ అయిన అంతర్జాతీయ గణిత (మ్యాథ్) అభ్యాస వేదిక భాన్జు ను 2020 లో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ (హ్యూమన్) కాలిక్యులేటర్‌గా గుర్తింపుపొందిన నీలకంఠ భాను ప్రకాష్ ప్రారంభించారు. నేడు ఈ సంస్థ 15 మిలియన్ డాలర్లను సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా సమీకరించినట్లు వెల్లడించారు. ఈ రౌండ్ ఫండ్‌కు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్ధ, ఎయిట్ రోడ్స్ వెంచర్స్ నేతృత్వం వహించింది. ఈ రౌండ్లో మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్ బీ క్యాపిటల్ సైతం పెట్టుబడులు పెట్టింది. ఈ సమీకరించిన నిధులను తమ సాంకేతిక మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంతో పాటుగా అసాధారణ విద్యార్ధి అభ్యాస అనుభవాలను సృష్టించేందుకు, మరింత ఆసక్తికరంగా, ఫలితాలను లక్ష్యంగా చేసుకున్న కంటెంట్‌తో తమ గణిత పాఠ్యాంశాలు (మ్యాథ్ కరిక్యులమ్)ను బలోపేతం చేసేందుకు భాన్జు వినియోగించనుంది.
తెలంగాణాలోనే చూసుకుంటే, ఐదవ తరగతి విద్యార్ధులలో సైతం లెక్కలు పూర్తిగా వచ్చిన వారి సంఖ్య అతి తక్కువ. వారి గణిత ప్రదర్శన పరంగా చూస్తే అది కేవలం 35%గా ఉంటుందని 2021లో విడుదల చేసిన నేషనల్ ఎచీవ్ మెంట్ నివేదిక వెల్లడిస్తుంది. విద్యార్థులలో అపార సామర్థ్యం ఉన్నప్పటికీ ఈ పెర్ఫార్మెన్స్ నివేదిక దీనిని గుర్తించడం జరిగింది. హైదరాబాద్ వాసి అయిన భాను, వ్యక్తిగతంగా సమగ్రమైన గణిత పాఠ్యాంశాలు సృష్టించడానికి ఇది స్ఫూర్తి కలిగించింది. గతంలో ఎన్నడూ గణితాన్ని ఆస్వాదించని విద్యార్థులు సైతం గణితాన్ని ఆస్వాదించేలా, గణితంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూనే సామాన్య శాస్త్రము (సైన్స్), గణితము (మ్యాథ్స్) మరియు భవిష్యత్‌లో ఇంజినీరింగ్ లో కెరీర్ పరంగా అత్యున్నత ప్రదర్శన చేసేందుకు తోడ్పడేలా దీనిని తీర్చిదిద్దారు.
భాన్జు వ్యవస్థాపకులు మరియు సీఈవో నీలకంఠ భాను. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందారు. శకుంతల దేవి మ్యాథ్ రికార్డ్లను సైతం ఇతను బద్దలుకొట్టారు. 2020లో అతను యావత్ దేశానికి గర్వకారణంగా నిలుస్తూ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ వద్ద భారతదేశపు తరపున మొట్టమొదటి గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆ తరువాత, భాన్జును భాను ప్రారంభించారు. ఇది గణిత అభ్యాస వేదిక. గణితమంటే ఉన్న భయాన్ని పోగొట్టే దిశగా ఇది కృషి చేస్తుంది.
ఈ ఫండింగ్ గురించి వేగవంతమైన హ్యూమన్ కాలిక్యులేటర్ మరియు భాన్జు సీఈఓ నీలకంఠ భాను మాట్లాడుతూ ‘‘సరైన అభ్యాస పద్ధతులతో గణితాన్ని అభ్యసించే సామర్థ్యం మన దేశంలో ప్రతి చిన్నారికీ ఉందని నేను నమ్ముతున్నాను. నా గణిత పాఠ్యాంశాలు, విద్యార్థులకు గణితమంటే ఉన్న భయాన్ని పొగొట్టడంతో పాటుగా సైన్స్, ఇంజినీరింగ్ వంటి రంగాలలో కెరీర్లను ఎంచుకునేలా వారికి స్ఫూర్తినందిస్తుంది. భారతదేశంలో ఆర్యభట్ట మొదలు రామానుజన్ నుంచి శకుంతల దేవి వరకూ గణిత మేధావులెందరో ఉన్నారు. ఊహాతీత సామర్ధ్యాన్ని భారతీయ మేధావులు కలిగి ఉన్నారు. మరింత మంది భారతీయులు తమ అసలైన సామర్ధ్యం గుర్తించేలా చేయాలని భాన్జు కోరుకుంటుంది. ఈ లక్ష్యం సాధించడానికి అత్యుత్తమ సామర్థ్యం గణితంకు ఉంది. భాన్జు గణిత కోర్సులతో, ప్రతి విద్యార్థి సరైన మార్గంలో గణితం అభ్యసించడం ప్రారంభించడం మాత్రమే కాదు , ఆ గణితాన్ని అభిమానిస్తారు’’ అని అన్నారు.
ఈ కంపెనీ 6 నుంచి 16 సంవత్సరాల లోపు విద్యార్థులకు గణితంలో అభ్యాస కార్యక్రమాలను అందిస్తుంది మరియు విద్యార్థులు నాలుగు రెట్లు వేగంగా , ఉత్తమంగా లెక్కలు చేసేందుకు విద్యార్థులకు సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకు అభిజ్ఞా సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు అవసరమైన, సరైన పునాదిని వేయడంలో తోడ్పడుతుంది. భాన్జు యొక్క పాఠ్యాంశాలను విస్తృత స్ధాయి డాటా సేకరణ మరియు నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనల ఆధారంగా నీలకంఠ భాను వ్యక్తిగతంగా తీర్చిదిద్దారు. బాటమ్ అప్ విధానాన్ని రూపొందించడం ద్వారా గణిత అభ్యాసం యొక్క పునాదిని ప్రశ్నించడం చుట్టూ ఇది తిరుగుతుంది.
విద్యార్ధులు ఎదుర్కొంటున్న భారీ సవాళ్లను భాన్జు పరిష్కరిస్తుంది మరియు ప్రతి చిన్నారి ఆస్వాదించతగిన గణిత అభ్యాస అనుభవాలను అందిస్తుంది. వినూత్న అభ్యాస పద్ధతులతో గణితంపై ప్రేమను పెంపొందించడానికి మరియు ప్రపంచంలోనే అత్యంత ఆలోచనాత్మకమైన, సంపూర్ణ గణిత పాఠ్యాంశంగా నిలిచేలా భాన్జు సృష్టించబడింది. మెంటల్ అధ్లెటిక్స్ విభాగంలో భారతదేశానికి దిక్సూచీ లా భాను నిలిచారు. గణితాన్ని వినోదాత్మక క్రీడగా మలచడంతో పాటుగా దానిని ప్రధాన స్రవంతి సంస్కృతిలో అంతర్భాగం చేయడం ద్వారా గణితమంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి మన ముందున్న మార్గం మరియు ప్రతి చిన్నారీ సరైన మార్గంలో గణితాన్ని అభ్యసించేలా చేయాలి.
నీలకంఠ భాను – ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్
భారతీయ గణిత విద్య – సాంకేతిక వేదిక భాన్జు , వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందిన నీలకఠ భాను ప్రకాష్. ప్రపంచ వ్యాప్తంగా గణిత అభ్యాస అనుభవాలను సమూలంగా మార్చాలన్నది ఆయన లక్ష్యం. తనకు 17 సంవత్సరాల వయసులోనే అతను శకుంతల దేవి లాంటి గణిత మేథావి రికార్డులను చెరిపివేశారు. అక్కడితో భాను ఆగలేదు. తన అసాధారణ సామర్థ్యంను మరింతగా ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. లండన్ లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ వద్ద మెంటల్ చాంఫియన్‌షిప్ 2020లో గోల్డ్ మెడల్ అందుకున్న మొట్టమొదటి భారతీయుడు మరియు ఆసియన్‌గా ఖ్యాతి గడించి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు మరెంతో మంది అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలనూ పొందారు. ఎంతోమంది ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచిన భాను, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడంతో పాటుగా అభిజ్ఞా పాఠ్యాంశాలను తీర్చిదిద్దారు. ఇది గణిత అభ్యాసాన్ని మరింత వినోదాత్మకంగా మలచడంతో పాటుగా విద్యార్థులకు ఆసక్తికరంగానూ ఉంటుంది. భాను ఇప్పటికి 23 దేశాలను సందర్శించడంతో పాటుగా 1000కు పైగా క్లాస్‌లను బోధించి 2 మిలియన్లకు పైగా విద్యార్థులపై ప్రభావం చూపారు మరియు గణితాన్ని ఓ క్రీడగా ప్రచారమూ చేశారు. నాలుగు ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్ రికార్డులను 2014, 2015 మరియు 2016లలో పలు విభాగాలలో పగలగొట్టారు. ఇండియా యొక్క యూత్ ఐకాన్ 2020 అవార్డును నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి భాను గెలుచుకున్నారు. ఫోర్బ్స్ ఆసియా 2022 30 అండర్ 30 యొక్క కన్స్యూమర్ టెక్నాలజీ విభాగంలో కూడా భాను ఫీచర్ చేయబడ్డాడు.
No comments:
Post a Comment