· భారతదేశవ్యాప్తంగా 30కు పైగా జ్యువెలర్స్ పాల్గొంటున్నారు
· పండుగ సీజన్ కారణంగా చక్కటి రాయితీలు. 2000 రూపాయల నుంచి 20 లక్షల రూపాయల ధరలో ఆభరణాలు
· మూడు రోజుల ఎక్స్‌పో అక్టోబర్ 01నుంచి అక్టోబర్ 03వ తేదీ వరకూ జరుగనుంది
హైదరాబాద్, 02 అక్టోబర్ 2022 : భారతదేశంలో అత్యద్భుతమైన, ప్రత్యేకమైన ఆభరణాల ఎగ్జిబిషన్ జక్ జ్యువెల్స్ ఎక్స్‌పో 141 వ ఎడిషన్‌తో హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఈ ప్రదర్శనను జక్ ట్రేడ్ ఫెయిర్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సయ్యద్ అజాన్ అహ్మద్ ప్రారంభించారు. అక్టోబర్ 01 నుంచి అక్టోబర్ 03వ తేదీ వరకూ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఈ ప్రదర్శన జరుగుతుంది.ఈ సారి ఈ ప్రదర్శనలో 30కు పైగా
సుప్రసిద్ధ ఆభరణాల వర్తకులు పాల్గొన్నారు. నూతన డిజైన్లతో ప్రీమియం శ్రేణి డిజైనర్
ఆభరణాలను భారీ రాయితీలతో అందిస్తున్నారు
ఈ ఎగ్జిబిషన్‌లో అతి సున్నితంగా
తీర్చిదిద్దబడిన మాస్టర్ పీస్‌లు
ప్రదర్శిస్తున్నారు. ఒక లక్షకు పైగా నూతన డిజైన్‌లతో పాటుగా వజ్రాలు, రూబీలు, ఎమరాల్డ్స్, సఫైర్స్, ముత్యాలు, ఇతర అరుదైన
రంగురాళ్లతో కూడిన ఆభరణాలను సైతం
ప్రదర్శిస్తున్నారు. వీటిలో మీనాకారి, కుందన్, జడౌ, ఇతర సంప్రదాయ
భారతీయ ఆభరణాలనూ ప్రదర్శిస్తున్నారు.
ఈ ప్రదర్శన ప్రారంభం
పురస్కరించుకుని జక్ ట్రేడ్ ఫెయిర్స్
అండ్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సయ్యద్ అజాన్ అహ్మద్
మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌కు
తిరిగి రావడం సంతోషంగా ఉంది. కోవిడ్ భయాలు తొలిగి పండుగ సంబరాలు ఇప్పుడు
కనిపిస్తుండటం మరింత సంతోషంగా ఉంది. జక్ జ్యువెల్స్ ఎక్స్‌పోను అత్యంత
జాగ్రత్తగా తీర్చిదిద్దాము. బ్రాండ్ల
అవసరాలు తీర్చే రీతిలో ఇది ఉండటం వల్ల విస్తృత శ్రేణిలో ఆభరణాలను వినియోగదారులు
ఎంచుకునేందుకు తగిన అవకాశాలను సైతం
కల్పించగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాలకు చెందిన అగ్రగామి
జ్యువెలర్స్‌ను ఒకే దరికి తీసుకువచ్చాము. నేరుగా తయారీదారుల నుంచి వినియోగదారుల
చెంతకు ఆభరణాలు తీసుకురావడం వల్ల 8–10% ఆదా చేసుకోగలరు’’ అని అన్నారు.
No comments:
Post a Comment