5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: అక్టోబర్ 14న హైదరాబాద్ లో తన మొదటి స్టోర్ ను ప్రారంభించనున్న మాగ్నోలియా బేకరీ

Saturday, October 8, 2022

అక్టోబర్ 14న హైదరాబాద్ లో తన మొదటి స్టోర్ ను ప్రారంభించనున్న మాగ్నోలియా బేకరీ

భారతీయ మార్కెట్లో తన ఉనికి విస్తరించుకుంటున్న ప్రపంచప్రఖ్యాత బేకరీ


భారతదేశం
, హైదరాబాద్, 08 అక్టోబర్ 2022:  కప్ కేక్స్, కేక్స్, పైస్, చీజ్ కేక్స్, ఐస్ బాక్స్ డెజర్ట్స్, కుకీస్ లతో సహా తన సిగ్నేచర్ బనానా పుడింగ్ లతో పాటుగా తాజా బేక్డ్ డెజర్ట్స్ కు పేరొందిన మంగోలియా బేకరీ హైద రాబాద్ లో 2022 అక్టోబర్ 14న తన మొదటి భారతీయ స్టోర్ ను ప్రారంభించనుంది. 1996లో న్యూయార్క్ నగరంలోని వెస్ట్ విలేజ్ లో మొదటగా ప్రారంభించబడిన ఈ బ్రాండ్ ఆకర్షణీయమైన అలంకరణలతో, అందంగా తీర్చిదిద్దబడిన కేక్స్, కప్ కేక్స్ తో కొనుగోలుదారులను విభిన్న రుచులతో అలరిస్తోంది.

2019లో స్పాగో ఫుడ్స్ ద్వారా భారతదేశంలోకి మంగోలియా బేకరీ ప్రవేశించింది. హైదరాబాద్ లోని నూతన స్టోర్ మంగోలియా బేకరీకి భారతదేశంలో బెంగళూరు వెలుపల మొదటి స్టోర్ కానుంది. నేడు మంగోలియా బేకరీ అమెరికాలో న్యూయార్క్ సిటీ, షికాగో, లాస్ ఏంజెల్స్ లలో కార్పొరేట్లీ ఓన్డ్ లొకేషన్స్ ను, దుబాయ్, అబుదాబి, రియాద్, అమ్మన్, దోహా, మనీలా, ఇస్తాంబుల్ లలో ఫ్రాంచైజీ లొకేషన్స్ ను కలిగిఉంది.

మంగోలియా ఇండియా ఫ్రాంచైజ్  స్పాగో ఫుడ్స్ పార్ట్ నర్ జోను రెడ్డి  ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ హైదరాబాద్ లో మా మొదటి మంగోలియా బేకరీ స్టోర్ ను ప్రారంభించడం మాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. హైదరాబాద్ కు చెందిన వారెంతోమంది బెంగళూరులో మా వద్దకు వచ్చినప్పుడు హైదరాబాద్ లో తమకు ఈ ఉత్పాదనలను అందించగలరా అని అడిగే వారు. వారి కోరికలు ఫలించాయి. అలా హైదరాబాద్ లో మా స్టోర్ ప్రారంభం కావడం ఒక సహజమైన తదుపరి అడుగుగా మారింది. మేం ఎల్లప్పుడూ భారతీయ మార్కెట్లో మా బ్రాండ్ ఉనికి పెంచుకునేందుకు చూస్తుంటాం. బెంగళూరు వెలుపలు మొదటి స్టోర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.

హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 45లో 3,000 చ.అ. విస్తీర్ణంలో ఇది నెలకొంది. ఇక్కడ అతిథులు 23 టేబుళ్లలో ఎక్కడైనా తాజా బేక్డ్ డెజర్ట్ ను రుచి చూడవచ్చు. కప్ కేక్, కేక్ ఐసర్స్ మధుర రుచులను ఆస్వాదించవచ్చు. అందంగా అలంకరించిన కేక్స్, కప్ కేక్స్ రుచులను ఆనం దించవచ్చు. స్టోర్ ముందు భాగంలోని మురల్ (గోడ) వద్ద ఫోటోలు దిగవచ్చు.

హైదరాబాద్ అనగానే గుర్తుకువచ్చే చార్మినార్, భారీ బుద్ధ విగ్రహంలతో పాటుగా న్యూయార్క్ స్ట్యాచూ ఆఫ్ లిబర్టీ, ఐకానిక్ ఎల్లో టాక్సీలు లతో సహా బ్రాండ్ ఐకానిక్ బనానా పుడింగ్, కప్ కేక్స్, కేక్ స్లైసెస్ వంటివి ఈ గోడపై చిత్రీకరించబడి ఉంటాయి. న్యూయార్క్ నగరానికి చెందిన రుచిని మంగోలియా బేకరీ ఏ విధంగా హైదరాబాద్ కు తీసుకువస్తున్నదో ఇది తెలియజేస్తుంది.

హైదరాబాద్ లో మంగోలియా బేకరీ ప్రారంభం గురించి స్పాగో ఫుడ్స్ పార్ట్ నర్ నిశ్చయ్ జయశంకర్ మాట్లా డుతూ, ‘‘హైదరాబాద్ లో మంగోలియా బేకరీని ప్రారంభించడం ఒక గొప్ప ఎంపిక. పర్యాటకులు కూడా అధి కంగా ఈ నగరానికి వస్తుంటారు. అందుకే ఫుడ్స్, డ్రింక్స్, డెజర్ట్స్ అంటే ఈ నగరానికి మక్కువ ఎక్కువ అని మేం విశ్వసిస్తున్నాం. మంగోలియా బేకరీ లో అవన్నీ లభ్యమవుతాయి. న్యూయార్క్ జట్టుతో కూడా మేం సన్నిహితంగా కలసి పని చేస్తుంటాం. భారతీయ మార్కెట్లోనూ అదే విధమైన నాణ్యత, చక్కదనం లభ్యమ య్యేలా చూస్తుంటాం’’ అని అన్నారు.



No comments:

Post a Comment