ముఖాడే విష్ణు నేతృత్వంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి, సిర్పూర్ (యు) మండలం పవార్ గూడ గ్రామాలకు చెందిన 25 కళాకారులతో కూడిన ఆంద్ గిరిజన సంఘం కళాకారులు ఆంద్ గిరిజన భాషలో పాటలు పాడుతూ వివిధ వేషధారణలో చేసిన దండారి నృత్యం శ్రీ సమ్మక్క-సారలమ్మ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా గోండు గుస్సాడీ కళాబృంద నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలలో గోండు దేవతలను పూజిస్తూ గుస్సాడి నృత్యాలు చేస్తామని అన్నారు. గోండు గిరిజనుల సంస్కృతిలో భాగమైన గుస్సాడి నృత్యాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో ప్రదర్శించినట్టు తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, చత్తిష్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు ఈ నృత్యాలను చూసి పరవశించారు.
No comments:
Post a Comment