ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో అరుదైన పూర్తి స్థాయి లాపరోస్కోపిక్ కీ హోల్ శస్త్ర చికిత్స కాలేయానికి జరగింది .. ఇటువంటి శస్త్రచికిత్స దేశంలో మొదటి సారి గవర్నమెంట్ హాస్పిటల్ లో జరగడం అనేది విశిష్టమైనది గా తెలుపుతున్నారు . తెలంగాణ రాష్ట్రం లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు ఈ ఘనతను సాధించారు .
ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్. బి. నాగేందర్ గారు మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్యులకు నిలయమైన ఈ హాస్పిటల్ లో ఇటువంటి అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం రోగి కూడా చికిత్సకు స్పందించి ఆరోగ్యం నిలకడ ఉండడం ఎంతో ఆనందంగా ఉందని వైద్య బృందానికి మనస్పూర్తిగా అభినందించారు. విభాగం విభాగధిపతి , వైద్యులు అత్యంత ఖరీదైన ఈ చికిత్స కొరకు అన్నీ సమకూర్చుకొని , కృషితో, నేర్పుతో, ఓపికతో చేయడం అనేది అసాధారణ విషయమని తెలిపారు..
శ్రీమతి మల్లెల వాణి ,31 సం,, హైదరాబాద్ వాస్తవ్యులు ,వారికి కాలేయంలో పెద్ద కణితి ఏర్పడి
( 14 x 11 సెంటీమీటర్లు ) భాధపడుతుంది .. ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించగా సుమారు 15 నుండి 20 లక్షల రూపాయల వ్యయం అవుతుందని , పేద వారు ఆర్థికంగా వెనకబడినవారు కావడంతో వీరు ఉస్మానియా హాస్పిటల్ లో ప్రవేశం పొందారు .
ఇటువంటి శస్త్ర చికిత్సలు దేశంలో సాధారణంగా ఓపెన్ చేసి పెద్ద కోతతో చేయడం అనేది జరుగుతుంది . ఈ చికిత్సలో రక్త స్రావం ఎక్కువగా జరగడం , దానివల్ల కిడ్నీలు ,గుండె మీద ప్రభావం పడుతుంది. కానీ ఈ యొక్క లాపరోస్కోపి శస్త్ర చికిత్స ( LAPAROSCOPIC RT
HEPATECTOMY THRU KEY HOLE ) చాలా కష్టతరమైనది మరియు ఛాలెంజింగ్ అని వీటికి ఎంతో అనుభవం ,నేర్పరితనం ఉండాలని , అనుభవజ్ఞలైన అనస్తీసియా వైద్యులు ఉండాలని తెలిపారు .. కాలేయంలోని పెద్ద కణితిని లాపరో స్కోపి ద్వారా విజయవంతంగా 04-02-2022 న తీసివేయడం జరిగినది.., శస్త్ర చికిత్సకు 8 గంటలు సమయం పట్టింది.
లాపరోస్కోపి శస్త్ర చికిత్స వలన తక్కువ నొప్పి, చిన్న గాటు ,త్వరగా కోలుకోవడం వంటివి ఉపయోగాలు. ఇటువంటి చికిత్సలకు ఎంతో ఖరీదైన పరికరాలు అవసరం మరియు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తెలిపారు.. పేద రోగి కి ఇటువంటి చికిత్స ను అందించి తన కు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించండం ఆనందంగా ఉందని తెలిపారు.
ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్. బి. నాగేందర్ గారు వైద్య బృందంలోని విభాగాధిపతి డాక్టర్ .సి.హెచ్ మధుసూదన్ గారికి ,డాక్టర్ పాండు నాయక్ గారికి, డాక్టర్ పావని గారికి, డాక్టర్ జ్యోతి గారికి ,డాక్టర్ మాధవి గారికి , డాక్టర్ హైఫజుర్ రెహ్మాన్ ,డాక్టర్ ఆనంద్ , డాక్టర్ సుదర్శన్ డాక్టర్ ఆదిత్య, డాక్టర్ వరుణ్, డాక్టర్ వేణు, మరియు సిబ్బంది సునీత సరళ మాధవి,సూర్య ప్రకాష్ కృష్ణ అందరికీ అభినందనలు ధన్యవాదములు తెలిపారు..
సర్జికల్ గాస్ట్రోఎంటరోలాజి ప్రోఫెసర్ & విభాగాధిపతి డాక్టర్ CH మధుసూదన్ గారు మాట్లాడుతూ ముందుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్. బి. నాగేందర్ గారికి మనస్పూర్తి గా కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపారు ,వారు అడిగిన తక్షణమే స్పందించి అవసరమైన ఖరీదైన పరికరములు సమకూర్చి , అన్నీ వేళల సహకరిస్తూ నడిపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా విభాగం తరపున ధన్యవాదములు తెలిపారు. హాస్పిటల్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి గారికి , అడ్మినిస్ట్రేటివ్ విభాగం RMO1 డాక్టర్ బి శేషాద్రి గారికి , నర్సింగ్ స్టాఫ్ మరియు నాల్గవ తరగతి ఉద్యోగులకు అందరికి ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్బంగా ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్. బి.నాగేందర్ గారు అన్ని వేళల సహకరించి మమ్మల్ని ముందుకు నడుపుతున్న గౌరవ వైద్య ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ. టి.హరీష్ రావు గారికి ,తెలంగాణా ప్రభుత్వము, డాక్టర్ . రమేష్ రెడ్డి DME గారికి, అడిషనల్ సూపరింటెండెంట్ గారికి,సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటర్ RMO 1 గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపారు .
No comments:
Post a Comment