5B5F1C08628D176A6BF733278418640B Breaking news in India and top headlines from Front Runner India: June 2021

Monday, June 28, 2021

Dr. Reddy’s Laboratories Announces Commercial Launch of 2DGTM

 Hyderabad, India. June 28, 2021 – Dr. Reddy’s Laboratories Ltd. (BSE: 500124, NSE: DRREDDY, NYSE: RDY, NSEIFSC: DRREDDY, hereafter referred to as “Dr. Reddy’s”) today announced the commercial  launch of 2-deoxy-D-glucose (2-DG). 

Dr. Reddy’s will supply to major Government as well as private hospitals across India. In the initial weeks, the Company will make the drug available in hospitals across metros and Tier 1 cities, and subsequently expand coverage to the rest of India. 

2-DG manufactured by Dr. Reddy’s has a purity of 99.5% and is being sold commercially under the brand name 2DGTM. The maximum retail price (MRP) of each sachet has been fixed at Rs. 990, with a subsidized rate offered to Government institutions. Enquiries for 2DGTM can be sent to 2DG@drreddys.com. 

2-DG was developed by the Institute of Nuclear Medicine & Allied Sciences (INMAS), a laboratory of the Defence Research and Development Organisation (DRDO), in collaboration with Dr. Reddy’s. 2-DG is an oral drug. It can be administered only upon prescription and under the supervision of a qualified physician to hospitalised moderate to severe COVID-19 patients as an adjunct therapy to the existing standard of care. Emergency use approval for anti-COVID-19 therapeutic application of the drug was granted on May 1, 2021. 

Dr. G. Satheesh Reddy, Secretary Department of Defence (R&D) and Chairman, DRDO said: “We are pleased to have worked closely with our long-term industry partner Dr. Reddy's Laboratories, Hyderabad, for testing 2-DG as therapeutic application in treatment of COVID-19 patients. DRDO has been contributing in fight against COVID-19 pandemic with its spin off technologies."

Satish Reddy, Chairman, Dr. Reddy’s said: “2-DG is yet another addition to our COVID-19 portfolio that already covers the full spectrum of mild to moderate and severe conditions and includes a vaccine. We are extremely pleased to have partnered with DRDO in our collective fight against the COVID-19 pandemic.”


Saturday, June 26, 2021

గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచిత శస్త్ర చికిత్స, వైద్య అందిస్తున్న బసవతారకం స్మైల్ ట్రైన్ పథకం

అర్హులను గుర్తించడానికి వీలుగా సోమ వారం 28 జూన్ నుండి జూలై 3 వరకు చిన్నారుల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు


గ్రహణం మొర్రితో భాదపడే చిన్నారులకు ఎదురయ్యే ఇబ్బందులు ఎన్నో.  జన్యుపరమైన ఇబ్బందుల వలన వచ్చే ఈ అంగవైకల్యం కారణంగా ఎందరో చిన్నారులు పలు రకములైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే చిన్నారుల సమస్యలకు సరైన చికిత్స అందించడం ద్వారా పరిష్కారం చూపవచ్చు.  

ఈ దిశగానే బసవతారకం స్మైల్ ట్రైన్ కార్యక్రమాన్ని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా. ముకుంద రెడ్డి నేతృత్వంలో స్మైల్ ట్రైన్ స్వఛ్చంద సంస్థ మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన ఆరోగ్య శిబిరములు ఏర్పాటు చేసి గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన శస్త్ర చికిత్స మరియు ఇతరత్రా వైద్య సేవలను బసవతారకం స్మైల్ ట్రైన్ పూర్తిగా ఉచితంగా అందజేస్తోంది.  ఇప్పటి వరకూ 3000 కు పైగా చిన్నారులు ఈ కార్యక్రమంలో భాగంగా చికిత్స పొందడం జరిగింది.

అయితే కరోనా మహమ్మారి కారణంగా బసవతారకం స్మైల్ ట్రైన్ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది.  దీంతో పలువురు చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరళా ఈ ఉచిత సేవలను ప్రారంభించాలని కార్యక్రమ నిర్వాహకులు డా. ముకుంద రెడ్డి నిర్ణయించారు.  ఈ ప్రణాళికలో భాగంగా ఈ నెల సోమవారం జూన్ 28 నుండి జూలై 3 వ తారీఖు వరకు ఉచిత వైద్య శిబిరాన్ని బసవతారకం స్మైల్ ట్రైన్ ఏర్పాటు చేసింది.   ఈ ఉచిత వైద్య శిబిరంలో గుర్తించబడిన చిన్నారులకు శస్త్ర చికిత్స ఉచితంగా చేయడంతో పాటూ మందులు వంటి వాటిని పూర్తిగా ఉచితంగానే అందించడం జరుగుతుంది.

ఇలాంటి ఇబ్బందులతో భాదపడుతున్న చిన్నారుల (ఆరు నెలలు నిండిన వారు) తల్లితండ్రులతో పాటూ కొత్తగా చూపించదలచుకొనే వారితో పాటూ గతంలో శస్త్ర చికిత్స తో పాటూ ఇతరత్రా వైద్య సదుపాయాలు పొందిన తర్వాత కూడా సమస్య  పూర్తిగా నయం కాని చిన్నారులు కూడా ఈ శిబిరానికి హజరు కావచ్చు.  ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా. ముకుంద రెడ్డి విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వివరాల కోసం తల్లితండ్రులు బసవతారకం స్మైల్ ట్రైన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్, రోడ్ నెం.10, బంజారా హిల్స్, హైదరాబాదు వద్ద సంప్రదించవచ్చు లేదంటే 9348198804 / 04023551235 నెంబర్లలలో సంప్రదించవచ్చు.

Wednesday, June 23, 2021

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్ట్ ల ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ

హైదరాబాద్ :  ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్ట్ ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది.దీని ప్రకారం, సాధారణ వార్డులకు మరియు ఐసోలేషన్కు ఛార్జీలు రోజుకు రూ .4,000, ఐసియు సౌకర్యాలు అవసరమయ్యే రోగులకు ఛార్జీలు రోజుకు రూ .7,500, వెంటిలేటరీ సపోర్ట్తో పాటు ఐసియు కేర్ అవసరమయ్యే వారికి రోజుకు రూ .9 వేలు వసూలు చేస్తారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు చట్టం ప్రకారం చర్యలను ఆకర్షించడానికి కొత్త ఛార్జీలను ఖచ్చితంగా పాటించవద్దని ఆదేశించబడ్డాయి. 

కోవిడ్ -19 రోగులకు వైద్యులు తరచూ సూచించే ఛాతీ యొక్క హై రిజల్యూషన్ సిటి (హెచ్ఆర్సిటి), ఐఎల్ -6 వంటి విశ్లేషణ పరిశోధనల ధరల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.కోవిడ్ రోగులను ఆసుపత్రులకు రవాణా చేసేటప్పుడు ప్రైవేట్ అంబులెన్స్ ఆపరేటర్లు వసూలు చేయగల రేట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కోవిడ్ -19 పరీక్షలకు సంబంధించిన క్యాప్డ్ ధరలు

:

  • హెచ్ఆర్సిటి- రూ .1,995 
  • ఐఎల్ -6 - రూ .1,300 
  • డిజిటల్ ఎక్స్ రే- రూ .300 
  • డి-డైమర్- రూ .800 
  • సిఆర్పి- రూ .500
  • ప్రోకాల్సిటోనిన్- రూ .1400 
  • ఫెర్రిటిన్- రూ .400 
  • ఎల్డిహెచ్- రూ .140 
  • అంబులెన్స్ ఛార్జీలు:
  • ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థలతో అంబులెన్స్: కిలోమీటరుకు రూ .75, కనీస ఛార్జీలు రూ 2,000. 
  • అధునాతన లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్తో కూడిన అంబులెన్స్: కిలోమీటరుకు రూ .125, కనీస ఛార్జీ  రూ. 3,000.

 

 

Tuesday, June 22, 2021

జూలై 11 న ఆషాడ మాస బోనాలు ప్రారంభం, లాల్ దర్వాజ్ బొనాలు (పాతబస్తీ ) ఆగస్టు 1 న జరుగుతాయి:మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  లాల్ దర్వాజ్ బొనాలు ఆగస్టు 1 జరుగుతాయి

జూలై 11 ఆషాడ బొనాలు ప్రారంభమవుతాయని , ఏడాది భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బొనాలు పండుగ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. గోల్కొండ బొనాలు జూలై 11 , మహంకళి (సికింద్రాబాద్) జూలై 25 , లాల్ దర్వాజ్ బొనాలు ఆగస్టు 1 జరుగుతాయి.

ఆషాడ బొనాలు పండుగను భారీ స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించినట్లు శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బంగారు బోనమ్ (నైవేద్యంను బంగారు కంటైనర్లో నైవేద్యం అర్పించడం) అర్పించాలని సిఎం కోరికను వ్యక్తం చేశారని ఆయన అన్నారు. పండుగ సందర్భంగా తెలంగాణ సంస్కృతి యొక్క నీతిని ప్రతిబింబించే కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

గతంలో జరిగిన బోనాల వివరాలకై ఫేసుబుక్ ని సందర్శించండి

https://www.facebook.com/oldcitybonalu2016


yesteryears Youtube videos of old city bonalu

Like us and share it with all

 

ఇండియాలో ఒక్క రోజే 86.16 ల‌క్ష‌ల వాక్సిన్‌ డోస్‌లు

 ఇండియా ఒక్క రోజే 86.16 ల‌క్ష‌ల వాక్సిన్ డోస్‌ల‌ను వేసింది. ప్ర‌పంచంలో ఇలా ఒక్క‌రోజు గ‌రిష్ఠ వాక్సిన్‌లు వేయ‌డంలో రికార్డు సాధించింది.దేశ వ్యాప్త వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 28.87 కోట్ల వాక్సిన్‌లు వేయ‌డం జ‌రిగింది ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 42,640 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 91 రోజుల‌లో 50,000 కంటే త‌క్కువ కేసులు న‌మోద‌య్యాయి.ఇండియా లో క్రియాశీల కేసుల సంఖ్య 6,62,521 కి ప‌డిపోయింది. 79 రోజుల త‌ర్వాత ఇది 7 ల‌క్ష‌ల దిగువ‌కు చేరింది.దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కూ 2,89,26,038 కోట్ల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.గ‌త 24 గంట‌లలో 81,839 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.దేశంలో రోజువారి కోవిడ్ కేసుల క‌న్న కోవిడ్ నుంచి కోలుకున్న వారిసంఖ్య వ‌రుస‌గా 40 వ రోజు ఎక్కువ‌గా ఉంది.రిక‌వ‌రీ రేటు 96.49 శాతానికి పెరిగింది. వార‌పుపాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 3.21 శాతం వ‌ద్ద ఉంది.రోజువారి పాజిటివిటి రేటు 2.56 శాతం. ఇది వ‌రుస‌గా 15 రోజులు 5 శాతంకంటే త‌క్కువ‌గా న‌మోదైంది.దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. మొత్తం 39.40 కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ను కలిసిన తెలంగాణ ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు జగన్

రాష్ట్రంలో ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఫీజులు కట్టలేక పేదలు ఇబ్బంది పడుతున్నారు..


ప్రయివేట్ ఆస్పత్రుల ఫీజుల కోసం ఆస్తులు, మెడలోని పుస్తెలు అమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం..

తెలంగాణ లోని ప్రయివేట్ ఆస్పత్రుల పై కేంద్రానికి పిర్యాదు చేసిన ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు జగన్

జగన్ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం

థర్డ్ వేవ్ వచ్చినా రాకున్నా, అన్ని జిల్లాల్లో, అన్ని పీహెచ్ సి ల్లో ఏర్పాట్లు చేయాలి.


ఢిల్లీ.. తెలంగాణ లో ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీ, వైద్యశాఖ నిర్లక్ష్యం పై కేంద్రానికి ఫిర్యాదు చేసింది బాధిత సంఘం. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ను తెలంగాణ ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు.. 

తెలంగాణ లో కరోనా పేరుతో ప్రయివేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయని బాధిత సంఘం అధ్యక్షుడు జగన్ ఆరోపించారు.. మొదటి, రెండో కరోనా వేవ్ ల్లో ప్రయివేట్ లో వైద్యం కోసం ఎంతో మంది తమ ఆస్తుల తో పాటూ, చివరికి మెడలోని పుస్తెలు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వాన్ని నిర్దేశించినా, ఫలితం లేకుండా పోయింది.

తెలంగాణ వైద్యశాఖ కు ప్రయివేట్ ఆస్పత్రుల పై వచ్చిన ఫిర్యాదులను లైట్ తీసుకున్నారని, నామ మాత్రపు చర్యలతో సరిపెట్టి ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీకి దోహదపడుతున్నారని ఆరోపించారు జగన్. కనీసం మూడో వేవ్ కోసమయిన రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ప్రత్యేక చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రం ఆదేశించాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్ ను జగన్ కోరారు..

థర్డ్ వేవ్ వచ్చిన రాకున్నా పిల్లల కోసం వైద్య సదుపాయాలు పెంచాలి..ప్రస్తుతం తెలంగాణ పిల్లల వైద్యం కోసం నిలోఫర్ ఆస్పత్రి మాత్రమే ఉందని, ఏ మారుమూల గ్రామంలో పిల్లలు అనారోగ్యం పాలైనా, హైదరాబాద్ వరకు రావాల్సి వస్తోందని కేంద్రమంత్రికి చెప్పారు. ప్రయివేట్ లో ఓపి చూయించుకోవాలంటేనే 800 రూపాయల నుంచి 1000 రూపాయలు కట్టాల్సి వస్తోందని, ఇక ఆస్పత్రిలో అడ్మిట్ అయితే రోజుకు లక్ష వసూలు చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.. . అందుకే ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్యంకోసం వంద పడకల ఆస్పత్రులను సిద్ధం చేయటం తో పాటూ , ప్రతి పిహెచ్ సి లో పిల్లల డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం అధ్యక్షుడు  జగన్ కోరారు.

*ప్రయివేట్ దాహానికి బడుగులే బలి అవుతున్నారని బిసి కమిషన్ కు జగన్ పిర్యాదు*


తెలంగాణ లో ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీపై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని కలిసిన బాదితసంఘం అధ్యక్షుడు జగన్. తెలంగాణ ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీకి పేదలు బలవుతున్నారని జాతీయ బిసి కమిషన్ సభ్యుడు ఆచారికి పిర్యాదు చేశారు. ప్రభుత్వం ఫిజుల నియంత్రణ కోసం జీవో 248 ఇచ్చినా ఫలితం లేదని ప్రయివేట్ ఆస్పత్రుల బాధిత సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

కింగ్ కోటి ఆస్పత్రి ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన

 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనం 19 వేలు చెల్లించాలని  డిమాండ్ చేస్తూ నేడు కింగ్ కోటి ఆస్పత్రి ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేయటం జరిగింది ఈ సందర్భంగా  *తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(AITUC)  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం. నర్సింహ*   మాట్లాడుతూ  రాష్ట్రంలో అన్ని రకాల సిబ్బందికి జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో శానిటేషన్, పేషెంట్ కేర్' సెక్యూరిటీ కార్మికులకు మాత్రం విస్మరించడం అన్యాయమని   గత సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ సిబ్బందికి కనీస వేతనం 19 వేలు చేయాలని అప్పటి వరకు పోరాటం  నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు  

శానిటేషన్ సిబ్బంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వారికి 17 వేలు, ఇఎస్ఐ ఆస్పత్రుల్లో సెంట్రల్ గవర్నమెంట్ రూ 16770/-, నిమ్స్ లో రూపాయలు 15వేలు చెల్లిస్తున్నారని, శానిటేషన్  పని ఆస్పత్రుల్లో చాలా మరికితో  కూడుకున్న పని అని ఆ పనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు

పండ్లలో సూపర్ ఫ్రూట్ అని పిలువబడే నల్లరేగుపండు(నేరేడు పండ్లు) పోషక విలువల గురించి మీకు తెలుసా?

 

పండ్లలో సూపర్ ఫ్రూట్ అని పిలువబడే నల్లరేగుపండు (నేరేడు పండ్లు)పోషక విలువల గురించి తెలుసుకుందాం .వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు నల్లరేగు పండ్లు విరివిగా కనిపిస్తుంటాయి . నల్లరేగుపండ్లనే హిందీలో కాలా జామున్ అని ఇంగ్లీషులో బ్లాక్ బెర్రీస్ అంటాము. వాటిలో ప్రయోజనకరమైన విటమిన్లు మరియు ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. నల్లరేగు పండ్లులో కేలరీలు, పిండి పదార్థాలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి. బ్లాక్బెర్రీస్ మీ ఆహారంలో సులభంగా చేర్చవచ్చు. ఒక కప్పు బ్లాక్‌బెర్రీస్‌లో 62 కేలరీలు, 1 గ్రాముల కొవ్వు, 14 గ్రాముల పిండి పదార్థాలు మాత్రమే ఉన్నాయి.

బ్లాక్బెర్రీస్ 25(GI) గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ను కలిగి ఉంది. కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు మీ రక్తంలో గ్లూకోజ్ ప్రతిస్పందనను ఎలా ప్రభావితం చేస్తాయో జిఐ ర్యాంక్ తెలియ చేస్తుంది. 55 లేదా అంతకంటే తక్కువ రేటింగ్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం తక్కువగా పరిగణించబడుతుంది.

బ్లాక్బెర్రీ న్యూట్రిషన్ వివరాలు :1 కప్పు (150 గ్రా) బ్లాక్బెర్రీస్ కోసం పోషకాహార సమాచారం 

కేలరీలు: 62

కొవ్వు: 0.7 గ్రా

సోడియం: 1 మి.గ్రా

కార్బోహైడ్రేట్లు: 13.8 గ్రా

ఫైబర్: 7.6 గ్రా

చక్కెరలు: 7 గ్రా

ప్రోటీన్: 2 గ్రా 

విటమిన్ సి :

కేవలం ఒక కప్పు బ్లాక్బెర్రీస్లో 30.2 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంది. ఇది రోజువారీ సిఫార్సు చేసిన విలువలో సగం. ఎముకలు, బంధన కణజాలం మరియు రక్తనాళాలలో కొల్లాజెన్ ఏర్పడటానికి విటమిన్ సి మీకు సహాయపడుతుంది:

విటమిన్ సి యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది శరీరంలో క్యాన్సర్కు దారితీసే ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. 

  • గాయాలను నయం చేయండి
  • చర్మం పునరుత్పత్తి
  • శరీరంలో ఫ్రీ రాడికల్స్ (టాక్సిన్స్ విడుదల చేసిన అణువులను) తగ్గిస్తుంది
  • ఇనుము యొక్క శోషణ
  • జలుబు తగ్గిస్తుంది
  • దురదను నివారిస్తుంది

విటమిన్ ఎ

బ్లాక్‌బెర్రీస్‌లో విటమిన్ ఎ కూడా ఉంటుంది, ఇది శరీరంలో అనేక విధులను నిర్వహిస్తుంది. విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది, అంటువ్యాధులు మరియు అనారోగ్యాలను ఎదుర్కుంటుంది. ఇది దంతాలు మరియు ఎముకల పెరుగుదల మరియు నిర్వహణకు తోడ్పడుతుంది, అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్ ఎ కంటి రెటీనాలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేయడానికి దృష్టికి సహాయపడుతుంది

వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది

చాలా మందికి వారి ఆహారంలో తగినంత ఫైబర్ లభించదు. ఇది ఒక సమస్య: తక్కువ ఫైబర్ ఆహారం ఉబ్బరం, మలబద్ధకం మరియు కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలతో ముడిపడి ఉంది. 2013 అధ్యయనం ప్రకారం, తగినంత ఫైబర్ లభించక పోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది

అధిక ఫైబర్ ఆహారం మీకు సహాయపడవచ్చు:


  • కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
  • సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది
  • చక్కెర శోషణ రేటు మందగించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
  • ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను ప్రోత్సహిస్తుంది

విటమిన్ కె 

విటమిన్ కె  రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఎముక జీవక్రియలో విటమిన్ కె కూడా పాత్ర పోషిస్తుంది. విటమిన్ కె లోపం ఎముక సన్నబడటానికి మరియు ఎముక పగుళ్లకు దారితీస్తుంది. కేవలం ఒక కప్పు బ్లాక్బెర్రీస్ దాదాపు 29 మైక్రోగ్రాముల విటమిన్ కె  అందిస్తుంది - రోజువారీ సిఫార్సు చేసిన విలువలో మూడింట ఒక వంతు - విటమిన్ కె  నల్ల రేగుపండ్ల ద్వారా లభిస్తుంది

మాంగనీస్ అధికంగా ఉంటుంది

ఇతర ఖనిజాల మాదిరిగా మీరు మాంగనీస్ గురించి ఎక్కువగా విని ఉండరు, కానీ ఇది ఆరోగ్యకరమైన ఎముక అభివృద్ధికి మరియు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. ఇది మీ శరీరం పిండి పదార్థాలు, అమైనో ఆమ్లాలు మరియు కొలెస్ట్రాల్ జీవక్రియకి సహాయపడుతుంది.


విటమిన్ సి మాదిరిగా, కొల్లాజెన్ ఏర్పడటానికి మాంగనీస్ కీలక పాత్ర పోషిస్తుంది. మాంగనీస్ కొల్లాజెన్, ఏర్పడటానికి సహాయపడుతుంది.మాంగనీస్ బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మరియు మూర్ఛ మూర్ఛలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఒక కప్పు బ్లాక్బెర్రీస్ 0.9 మిల్లీగ్రాముల మాంగనీస్ ఉంటుంది, ఇది రోజువారీ సిఫార్సు చేసిన విలువలో సగం.

మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది

బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీ పండ్లను తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వృద్ధాప్యం వల్ల జ్ఞాపకశక్తి తగ్గకుండా సహాయపడుతుంది అని జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ పరిశోధనలో వెల్లడించింది

బెర్రీ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి మరియు మెదడు న్యూరాన్లు ఎలా సంభాషించాలో మార్చడానికి సహాయపడతాయని సమీక్ష తేల్చింది.